Service book lo leave entries wrong ga unnayi — correct cheyyadam ela?

By 210 🥈 13/06/26 22:23

నా service book lo 2022 lo teesukunna earned leave entry wrong ga register ayyindi. Ippudu annual verification time lo problem vastundi.

Evarini approach cheyyali? HOO ne correct chestara leka AG office ki vellala?

Evaraina same problem face chesara? Procedure cheppandi please.

0
2 answers 19 views Login to Reply

2 Answers

KR
337 🥈

If an entry wrong made by same officer, he can strike and correct it. or else Dist officer of the dept concerned can do corrections and wrong entires 4rm: krishna

AD
admin 210 🥈
210 🥈

మీరు AG ఆఫీస్ (Accountant General Office) కి వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు.మీ HOO (Head of Office) / Drawing and Disbursing Officer (DDO) గారికే ఈ తప్పును సరిచేసే (Correction) పూర్తి అధికారం ఉంటుంది.

వినతి పత్రం (Representation): మీ Head of Office (HOO) గారికి ఒక లెటర్ రాయండి. అందులో "ఫలానా 2022 సంవత్సరంలో నేను తీసుకున్న Earned Leave (EL) ఎంట్రీ పొరపాటున తప్పుగా నమోదైందని, దానిని సరిచేయాలని" కోరండి.ఆధారాలు జతపరచడం (Supporting Documents): 2022 లో ఆ లీవ్ మంజూరు చేస్తూ ఆఫీస్ ఇచ్చిన లీవ్ శాంక్షన్ ఆర్డర్ (Leave Sanction Proceedings) కాపీని లేదా ఆ నెల జీతం బిల్లు (Acquittance / Pay Slip) ను మీ అప్లికేషన్‌కు జత చేయండి.

సర్వీస్ రిజిస్టర్ లో ఎలాంటి దిద్దుబాట్లు (Erasures or Over-writing) చేయకూడదు. తప్పుగా ఉన్న ఎంట్రీపై ఒక గీత కొట్టి, దాని కింద లేదా పక్కన సరైన వివరాలు రాసి, తప్పనిసరిగా HOO గారి సంతకం పెట్టించాలి.